చిలకలూరిపేట: నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు కి మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు శుభాకా...
చిలకలూరిపేట: నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు కి మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ ఛాంబర్‌లో ఆయనను కలిసి పూలమాలలు, బొకేలతో అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవిన్యూ అధికారులు పి. సుబ్బారావు, గిరిబాబు, ఖాదర్, మున్సిపల్ మేనేజర్ మొహిద్దిన్ పాల్గొన్నారు. వారితో పాటుగా సిబ్బంది గాయత్రి, రాజేంద్ర, అవినాష్, ఆంజనేయులు, రమేష్, ఖాసీం మరియు ఇతర మున్సిపల్ ఉద్యోగులు కమిషనర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, పట్టణ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
COMMENTS