రూ. 5.55 లక్షల విలువైన సొత్తు స్వాధీనం పల్నాడు జిల్లా పోలీసుసూపరింటెండెంట్ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు, నరసరావుపేట డి.ఎస్.పి. ...
రూ. 5.55 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
పల్నాడు జిల్లా పోలీసుసూపరింటెండెంట్ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు, నరసరావుపేట డి.ఎస్.పి. ఎం. హనుమంతురావు పర్యవేక్షణలో చిలకలూరిపేట పట్టణ పోలీసులు ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను డి.ఎస్.పి. హనుమంతురావు విలేకరుల సమావేశంలో తెలియజేశారు.
చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 370/2025 కింద కేసు నమోదైన భైరా సుజాత ఇంటి దొంగతనంలో ఈ ముఠా నిందితులుగా ఉన్నారు. ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులను చిలకలూరిపేటలోని గుర్రాల చావిడి, వేలూరు డొంకలో పాత బాలాజి సినిమా హాల్ దగ్గర డిసెంబర్ 15, 2025 మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో నూర్ హసన్ (A1), నోసద్ (A2), మిన్నా యామిన్ (A3), అబ్దుల్ గఫ్ఫార్ (A4), మరియు సాహుల్ @ సాహుల్ జబ్బార్ (A5) ఉన్నారు. A5 అయిన సాహుల్ @ సాహుల్ జబ్బార్, A2 అల్లుడు. ఇతను చిలకలూరిపేట టౌన్‌లో వెల్డింగ్ పనులు చేసుకుంటూ నివాసం ఉంటున్నాడు. పలాస కోర్టులో వాయిదాలు ఉండటం వల్ల A1 మరియు A4 లు చిలకలూరిపేటకు వచ్చి, A5 వద్ద బస చేసి, A2, A3 లను రప్పించుకుని ఈ దొంగతనానికి పాల్పడ్డారు. నవంబర్ 28, 2025 అర్థరాత్రి 11:30 గంటల సమయంలో పిర్యాది ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువా తాళాలు పగులగొట్టి సుమారు 21 సవర్ల బంగారు వస్తువులు, 10 వాచీలు, రెండు వెండి చైన్లు, మరియు రూ. 1,00,000/- నగదుతో సహా మొత్తం రూ. 5,55,000/- విలువైన సొత్తును దొంగిలించారు. ఈ దొంగల ముఠాపై హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలలో కేసులు నమోదై ఉన్నాయని డి.ఎస్.పి. తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల నుండి దొంగిలించబడిన వస్తువులు మరియు నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్, స్క్రూడ్రైవర్, హ్యాండ్ గ్లాస్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ముఖ్యపాత్ర వహించిన చిలకలూరిపేట అర్బన్ సీఐ పి. రమేష్ , ఎస్సై హజరత్తయ్య, సిబ్బందివై. శ్రీనివాస్,ఎస్. వణు కుమార్,వి. హరీష్,కె. శ్రీరాములు,వి. నారాయణ రావు, జి. జాన్ బాబు, కె. శివ కృష్ణ,షేక్ జాన్ బాషా,మరియు ఇతర సిబ్బందిని డి.ఎస్.పి. అభినందించారు.
COMMENTS