చిలకలూరిపేట: పట్టణంలో లీగల్ మెట్రాలజీ (తపాలా మరియు కొలతల) శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలకు రావడం కలకలం సృష్టించింది. తనిఖీలకు వచ్చ...
చిలకలూరిపేట: పట్టణంలో లీగల్ మెట్రాలజీ (తపాలా మరియు కొలతల) శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలకు రావడం కలకలం సృష్టించింది. తనిఖీలకు వచ్చిన అధికారులను చూసిన పట్టణంలోని బంగారు నగల దుకాణాల యజమానులు, షాపులు మూసివేసి ఉడాయించారు. దీంతో అధికారులు సైతం షాక్ అయ్యారు.
ఎందుకు ఈ తనిఖీలు...
బంగారు దుకాణాలలో వినియోగించే తూనిక యంత్రాలు (త్రాసులు) సరిగా పనిచేస్తున్నాయా లేదా, వాటికి సరైన ధృవీకరణ ఉందా, కొలతల్లో లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించేందుకు లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు పట్టణానికి వచ్చారు.
షాపులన్నీ బంద్...
అధికారులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మరియు బజార్లలోని బంగారు షాపుల వద్దకు వెళ్లేసరికి, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు అన్ని ప్రధాన బంగారు దుకాణాలు మూసి ఉండటం కనిపించింది. తనిఖీ సమాచారం ముందే తెలుసుకున్న వ్యాపారులు, భారీ జరిమానాలు మరియు కేసులు తప్పించుకునేందుకు ముందుగానే షాపులను మూసివేసినట్లు తెలుస్తోంది.
COMMENTS