చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీమంత్ర...
చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీమంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ ను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, విధవలు వంటి సామాజికంగా బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ధ్యేయంతో ఎన్టీఆర్ భరోసా పథకం అమలవుతోందని తెలిపారు.కూటమి ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలనే ఇప్పుడు మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.
పట్టణంలోని 30,31 వార్డులకు చెందిన లబ్ధిదారులు పెన్షన్ సొమ్ము అందుకున్నారు.ఈ పథకం వల్ల రోజువారి జీవనంలో కొంత ఆర్థిక నెమ్మది కలుగుతోందని పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి స్థానిక నాయకులు, కార్యకర్తలు, మునిసిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.
COMMENTS