పారిశుద్ధ్య పనులు పిచ్చి మొక్కల తొలగింపు.. ఇన్చార్జ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ ఖాదర్. చిలకలూరిపేట: పట్టణ ప్రజల ఆరోగ్య...
పారిశుద్ధ్య పనులు పిచ్చి మొక్కల తొలగింపు..
ఇన్చార్జ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ ఖాదర్.
చిలకలూరిపేట: పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని సూచనలు, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆదేశాల మేరకు పట్టణంలోని పలు డివిజన్లలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డివిజన్-1 పరిధిలో ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో సోమవారం విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. 37వ వార్డు పరిధిలోని పండరీపురం ఏరియాతో పాటు పట్టణంలోని ఈస్ట్ క్రిస్టియన్ పేట, సుబ్బయ్య తోట, ఎన్టీఆర్ కాలనీ వంటి ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించారు. అనంతరం దోమల నివారణకు గాను కాలువలపై ఆయిల్ స్ప్రేయింగ్ చేయించారు.
అదేవిధంగా, 10వ వార్డు పరిధిలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటి వల్ల పాములు వస్తున్నాయని స్థానికుడు సుభాని చేసిన ఫిర్యాదుపై అధికారులు తక్షణమే స్పందించారు. ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్ పర్యవేక్షణలో జెసిబి సాయంతో ఆ ప్రాంతంలోని పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు కౌన్సిలర్ పాములపాటి శివ కుమార్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS