శ్రీ శారద జడ్పీ హైస్కూల్‌కు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ప్రారంభం. చిలకలూరిపేట: పట్టణంలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...
శ్రీ శారద జడ్పీ హైస్కూల్‌కు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ప్రారంభం.
చిలకలూరిపేట: పట్టణంలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ తక్షణం నెరవేర్చారు. ఈ నెల 5న పాఠశాలలో జరిగిన మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్‌లో విద్యార్థులు కోరిన లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మాట నిలబెట్టుకున్న ఆయన, పదిరోజుల్లోనే సొంత నిధులతో 25 కంప్యూటర్లు పంపించడంతో పాటు, అవసరమైన పుస్తకాలతో ఆధునిక లైబ్రరీని ఏర్పాటుచేశారు.సోమవారం నాడు ఆ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్‌ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఆర్డీవో మధులత, స్థానిక తహసీల్దార్, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రిబ్బన్ కట్ చేసి సదుపాయాలను అధికారులందరూ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా చూపిన చొరవ ఆదర్శనీయం. విద్యారంగ అభివృద్ధి అంటే కేవలం మౌలిక వసతులు కాదు,విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి అవకాశాలు కల్పించడమే ప్రధాన దార్శనికత అని పేర్కొన్నారు.
తదుపరి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఈ సాయంతో చిలకలూరిపేట విద్యార్థులకు నూతన దిశా నిర్దేశం లభించింది. సొంత నిధులతో ఇంత విలువైన సదుపాయాలు ఏర్పాటు చేయడం పవన్ కళ్యాణ్ సేవా దృక్పథానికి నిదర్శనం. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుంది అని అన్నారు.విద్యార్థుల కోసం ఉప ముఖ్యమంత్రి చూపిన ప్రతిబద్ధత కూటమి ప్రభుత్వ విద్యా సంకల్పానికి ప్రతిబింబమని తెలిపారు.పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.ఇప్పుడు విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునే అవకాశం పొందారు.ఈ సౌకర్యాలు వారి భవిష్యత్ అకడమిక్ ప్రగతికి బాటలు వేస్తాయి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధులత,తాసిల్దార్ షేక్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు, ఎంఈఓ, జనసేన నియోజకవర్గ యువ నాయకులు మండలనే చరణ్ తేజ్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, హై స్కూల్ చైర్మన్, ప్రధానోపాధ్యాయులు,పలువురు అధికారులు, కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
COMMENTS