క్లిష్టమైన మర్డర్ కేసును ఛేదించినందుకు గుర్తింపు.. చిలకలూరిపేట: వృత్తిపరమైన నైపుణ్యం, అంకితభావంతో పనిచేసే పోలీసు అధికారులకు ఇచ్చ...
క్లిష్టమైన మర్డర్ కేసును ఛేదించినందుకు గుర్తింపు..
చిలకలూరిపేట: వృత్తిపరమైన నైపుణ్యం, అంకితభావంతో పనిచేసే పోలీసు అధికారులకు ఇచ్చే అత్యున్నత గుర్తింపు చిలకలూరిపేట పోలీసులను వరించింది. యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ క్లిష్టమైన హత్య కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించినందుకు గాను పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ,ఇన్చార్జి డిఎస్పి ఎం హనుమంతరావు,చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు మరియు వారి బృందానికి రాష్ట్ర స్థాయి "ఏబీసీడీ" అవార్డు లభించింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని వారు అందుకున్నారు.
సవాలుగా మారిన గుర్తు తెలియని మృతదేహం..
యడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన Cr.No: 68/2025 (U/S 62, 103(1), 238 r/w 3(5) BNS) కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో, క్లూస్ లేని ఈ కేసును ఛేదించడం అధికారులకు పరీక్షగా నిలిచింది. పల్నాడు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, నరసరావుపేట డిఎస్పీ మార్గదర్శకత్వంలో ఈ కేసు విచారణ ప్రారంభమైంది.
సిఐ సుబ్బానాయుడు నేతృత్వంలో మెరుపు దర్యాప్తు..
ఈ కేసులో సిఐ సుబ్బానాయుడు కీలక పాత్ర పోషించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, క్షేత్రస్థాయి విచారణను సమన్వయం చేస్తూ నిందితులను పట్టుకోవడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం.సీడీఆర్ వింగ్ సాయంతో అనుమానితుల కదలికలను పసిగట్టారు.యడ్లపాడు ఎస్.ఐ శివరామకృష్ణ మరియు క్రైమ్ సిబ్బందిని సమన్వయం చేస్తూ విచారణను వేగవంతం చేశారు.
ఘటనా స్థలంలో లభించిన స్వల్ప ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించి నిందితులను గుర్తించారు.
అవార్డు అందుకున్న ప్రతిభావంతులు..
పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఇన్చార్జి డిఎస్పి హనుమంతరావు,
సిఐ సుబ్బానాయుడుతో పాటు ఈ కేసులో కీలక కృషి చేసిన ఈ క్రింది బృందానికి కూడా గుర్తింపు లభించింది.
యడ్లపాడు ఎస్.ఐ శివరామకృష్ణ,
ఏఎస్ఐలు సుబ్బారావు, రోశిబాబు
, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, కానిస్టేబుల్ యిర్మియా హోంగార్డులుమధు, సాంబశివరావు,పల్నాడు జిల్లా క్లూస్ టీం మరియు సీడీఆర్ వింగ్ సిబ్బంది.
పోలీసు వర్గాల్లో హర్షాతిరేకాలు..
రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను సిఐ సుబ్బానాయుడు బృందానికి అవార్డు రావడం పట్ల పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. క్లిష్టమైన కేసులను ఛేదించడంలో సిఐ సుబ్బానాయుడు చూపే చొరవ ఇతర అధికారులకు స్ఫూర్తిదాయకమని సహచర అధికారులు కొనియాడారు.
COMMENTS