చిలకలూరిపేట: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం అందుత...
చిలకలూరిపేట: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. బస్టాండ్‌లోని వాణిజ్య దుకాణాలలో టెండర్ నిబంధనల ప్రకారం విక్రయాలు జరగడం లేదని, వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
టెండర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న అంశాలపై విజిలెన్స్ బృందం కూలంకషంగా విచారణ జరుపుతోంది. అధికారుల రాకతో బస్టాండ్‌లోని దుకాణదారుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
COMMENTS