ప్రతి నెలా నాలుగో శనివారం... జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా. పల్నాడు: జిల్లాలో ఇక నుంచీ ప్రతి నెలా నాలుగో శనివారం కలెక్టరేట్ లో ది...
ప్రతి నెలా నాలుగో శనివారం...
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
పల్నాడు: జిల్లాలో ఇక నుంచీ ప్రతి నెలా నాలుగో శనివారం కలెక్టరేట్ లో దివ్యాంగులకు ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. అందులో భాగంగా రేపు ఉదయం ఎస్సీ, ఎస్టీలతో పాటూ దివ్యాంగుల కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నామన్నారు.
ప్రతి సోమవారం అందరితో పాటూ అర్జీలు సమర్పించడంలో దివ్యాంగులు ఇబ్బందిపడటం గుర్తించానని, విభిన్న ప్రతిభావంతులు అర్జీలు సమర్పించడానికి ప్రత్యేక వేదిక కల్పించాలనే ఆలోచనతో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఈ అవకాశాన్ని దివ్యాంగులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
COMMENTS