చిలకలూరిపేట: స్థానిక పురపాలక సంఘ పరిధిలోని సచివాలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ప్రింటర్లను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున...
చిలకలూరిపేట: స్థానిక పురపాలక సంఘ పరిధిలోని సచివాలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ప్రింటర్లను మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు బుధవారం పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జీఎస్డబ్ల్యూఎస్ (GSWS) విభాగం అధికారులు ఈ ప్రింటర్లను మున్సిపల్ కార్యాలయానికి పంపించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, అధికారులు సూచించిన ఆయా సచివాలయాల అడ్మిన్ సెక్రెటరీలకు ఈ యంత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ . షేక్ అబ్దుల్ రహీం, రెవిన్యూ ఆఫీసర్ పొత్తూరి సుబ్బారావు, మున్సిపల్ మేనేజర్ మొహిద్దీన్, మున్సిపల్ ఉద్యోగులు రమేష్, అమిత్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ప్రింటర్ల రాకతో సచివాలయాల్లో ప్రజలకు అందించే సేవలు మరింత వేగవంతం అవుతాయని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
COMMENTS