ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండవీడు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమ జూదం జరుగుతున్నదన్న సమాచారం ఆధారంగా ఎడ్లపాడు ఎస్సై ట...
ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండవీడు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమ జూదం జరుగుతున్నదన్న సమాచారం ఆధారంగా ఎడ్లపాడు ఎస్సై టి శివరామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక దాడి నిర్వహించారు.ఈ దాడి సమయంలో అక్కడ జూదంలో పాల్గొంటున్న ఏడుగురు వ్యక్తులను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు వారి వద్ద నుంచి జూదానికి ఉపయోగిస్తున్న రూ.16,800/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు, దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎడ్లపాడు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్సై టి శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, జూదం వంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని హెచ్చరించారు.
COMMENTS