ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థ సభ్యులు, కూటమినాయకులతో కలిసి మొక్కలు నాటిన మాజీమంత్రి ప్రత్తిపాటి. చిలకలూరిపేట...
ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థ సభ్యులు, కూటమినాయకులతో కలిసి మొక్కలు నాటిన మాజీమంత్రి ప్రత్తిపాటి.
చిలకలూరిపేట: ప్రభుత్వం.. ప్రజలు.. స్వచ్చంద సంస్థల సహకారంతో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లోనూ సంపన్నులు భాగస్వాములు కావాలని , పేదల జీవితాల్ని నిలబెట్ట డంతో పాటు...సమాజనిర్మాణంలోనూ వారు తమదైన ముద్ర వేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు.
ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో కీ.శే.పమిడి శేషమ్మ వర్థంతి సందర్భంగా ప్రముఖ వైద్యురాలు కందిమళ్ల జయమ్మ సహకారంతో మురికిపూడి గ్రామ ఆశ్రమంలో సోమవారం చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా ఆర్గనైజేషన్ సభ్యులు.. కూటమినాయకులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం ఒయాసిస్ ఆధ్వర్యంలో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రహరీ గోడను పరిశీలించిన ప్రత్తిపాటి తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగించారు.
పేదల సంక్షేమంతో పాటు.. సమాజాభివృద్ధిలోనూ సంపన్నులు భాగస్వాములు కావాలని, అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికైన పీ-4 పథకానికి సార్థకత చేకూరుతుందని ప్రత్తిపాటి తెలిపారు. నియోజకవర్గం నుంచి దేశ, విదేశాల్లో స్థిరపడిన వారిని సంప్రదించి, వారి భాగస్వామ్యంతో గ్రామాల రూపు రేఖలు మార్చేదిశగా కూటమిశ్రేణులు కార్యాచరణ రూపొందించాలన్నారు. మన ఆలోచనలు..ఆచరణల్లో చిత్తశుద్ధి ఉంటే దాతలు కచ్చితంగా చేయూత అందిస్తారని, వారిని ఆ దిశగా ఒప్పించడమే ప్రధానమని ప్రత్తిపాటి సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఒయాసిస్ అధ్యక్షురాలు కందిమల్ల జయమ్మ, జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మద్దూరి వీర రెడ్డి, గట్టినేని రమేష్ , కరణం విజయ, దండా గోపి, కందిమల్ల నారాయణ మూర్తి, పి. రమాదేవి, కోలా విజయ లక్ష్మీ, ఒయాసిస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
COMMENTS