నూతన సంవత్సర వేడుకలు... నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు... చిలకలూరిపేట: పట్టణ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను అత్యంత క్రమశిక్షణత...
నూతన సంవత్సర వేడుకలు...
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు...
చిలకలూరిపేట: పట్టణ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను అత్యంత క్రమశిక్షణతో, చట్టానికి లోబడి జరుపుకోవాలని అర్బన్ సీఐ రమేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూనే, భద్రతా పరమైన అంశాలపై హెచ్చరికలు జారీ చేశారు.
నిరంతర నిఘా మరియు పోలీసింగ్...
డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకల సమయంలో పట్టణంలోని ప్రతి ప్రధాన కూడలి, వీధి మరియు కీలక ప్రాంతాల్లో పోలీస్ నిఘా ఉంటుందని సీఐ రమేష్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన పేర్కొన్నారు.
యువతకు ప్రత్యేక సూచనలు....
ముఖ్యంగా యువత ఉత్సాహంలో అతిగా ప్రవర్తించవద్దని ఆయన సూచించారు. నడిరోడ్డు పై కేక్ కటింగ్ లు ,రోడ్లపై బైక్ రేసింగ్‌లు చేయడం.అతి వేగంగా వాహనాలు నడపడం.మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి పనులకు దూరంగా ఉండాలి.బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించేలా అల్లర్లు చేయడం వంటివి చేస్తే సహించేది లేదని ఎవరి ఇంటి ముందు వారు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
అవాంఛనీయ సంఘటనలపై నిఘా...
వేడుకల పేరుతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన శిక్షలు తప్పవని తేల్చి చెప్పారు.ఆనందం అనేది ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకే బాగుంటుందని, కావున పట్టణ ప్రజలందరూ పోలీసులకు సహకరించి, ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలని సీఐ రమేష్ కోరారు.
COMMENTS