150 టన్నుల ఎరువుల స్వాధీనం... నరసరావుపేట:వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నరసరావుపేట పట్టణంలోని సాయి కృష్ణ ఫర్టిలైజర్స...
150 టన్నుల ఎరువుల స్వాధీనం...
నరసరావుపేట:వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నరసరావుపేట పట్టణంలోని సాయి కృష్ణ ఫర్టిలైజర్స్ ఎరువులు షాపులో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎరువుల గోడౌన్స్ సంబంధించి వారు నిర్వహిస్తున్న ఐదు స్టోరేజ్ పాయింట్స్ ఎరువులను పరిశీలించారు. సరైన రికార్డులు లేవని, ఎరువుల నిల్వలలో వ్యత్యాసం గుర్తించడంతో 150 టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సహాయ వ్యవసాయ సంచాలకులు మురళీ కృష్ణ తెలిపారు. వాటి విలువ రు. 40.7 లక్షలు ఉంటుందని తెలిపారు. ఆ డీలరుపై కేసు నమోదు చేసేమన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ అదికారులు కె. వెంకటరావు, ఐ. శాంతి ఏఈవో కె. బ్రహ్మయ్య పాల్గొన్నారు.
COMMENTS