యడ్లపాడు మండల పరిధిలో ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) ద్విచక్ర వాహనం కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక ప...
యడ్లపాడు మండల పరిధిలో ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్) ద్విచక్ర వాహనం కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బ నాయుడు ఆదేశాల మేరకు, యడ్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ టి.శివరామకృష్ణ సిబ్బందితో కలిసి దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తు భాగంగా పరిసర ప్రాంతాల్లో అనుమానితులుగా గుర్తించిన చిలకలూరిపేటకు చెందిన పోలిశెట్టి మహేష్ బాబు, చిలక విగ్నేష్ @ సన్నీ, పల్లపు ఆంజనేయులు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
విచారణలో నిందితుల వద్ద నుండి మొత్తం నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీటిలో రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిళ్లు, రెండు స్కూటీలు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న నాలుగు ద్విచక్ర వాహనాల అంచనా విలువ సుమారు రూ. 3,70,000/-గా వెల్లడించారు.
రికవర్ చేసిన ద్విచక్ర వాహనాలను చట్టపరమైన విధానాల ప్రకారం స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, స్వల్పకాలంలోనే కేసును ఛేదించిన యడ్లపాడు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
COMMENTS