యడ్లపాడు: పాలపర్తి శ్రీరామమూర్తి (41), తండ్రి వెంకట సుబ్బయ్య, కొలలపూడి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. వృత్తిరీత్యా గొర...
యడ్లపాడు: పాలపర్తి శ్రీరామమూర్తి (41), తండ్రి వెంకట సుబ్బయ్య, కొలలపూడి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. వృత్తిరీత్యా గొర్రెల కాపరిగా ఉన్న శ్రీరామమూర్తి, మార్టూరు మండలం నుండి యడ్లపాడు మండలం జగ్గపురం గ్రామానికి వలస వచ్చి, ఇతర కాపరులతో కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో గొర్రెలను మేపుతూ జీవనోపాధి సాగించేవాడు.డిసెంబర్ 11న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో తిమ్మాపురం గ్రామ శివారులో గొర్రెల వద్దకు వెళ్లిన శ్రీరామమూర్తి, మరుసటి రోజు(12/12/25) ఉదయం అదృశ్యమైనట్లు తెలిసింది.ఈ విషయం తెలిసిన అతని భార్య బంధువులతో కలిసి గ్రామం, పొలాలు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆయన ఆచూకీ లభించలేదు.ఈ ఘటనపై భాధితురాలు యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదృశ్యమైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
COMMENTS