జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ... చిలకలూరిపేట: నియోజకవర్గ యువతకు, జనసైనికులకు జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ముందస్తు ...
జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ...
చిలకలూరిపేట: నియోజకవర్గ యువతకు, జనసైనికులకు జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి జనసైనికుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ, క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సమయంలో యువత రోడ్ల మీదకు వచ్చి కేక్ కటింగ్లు, మితిమీరిన వేగంతో బైక్ రైడింగ్‌లు వంటి పనులకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఉత్సాహం ముసుగులో అపశృతులకు తావివ్వకుండా, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జనసైనికుల క్రమశిక్షణే పార్టీకి బలమని, బాధ్యతాయుతమైన పౌరులుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చరణ్ తేజ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
COMMENTS