ముఖ్యఅతిథిగా కౌన్సిలర్ పాములపాటి శివకుమారి... చిలకలూరిపేట: మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ...
ముఖ్యఅతిథిగా కౌన్సిలర్ పాములపాటి శివకుమారి...
చిలకలూరిపేట: మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలోని 37వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. వార్డు కౌన్సిలర్ పాములపాటి శివకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు వారి ఇంటి వద్దే 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్లను అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ శివకుమారి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి అర్హుడికి చేరాలన్నదే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా ప్రజా ప్రతినిధులు నేరుగా లబ్ధిదారులను కలిసి పెన్షన్లు పంపిణీ చేయాలని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే సూచనల మేరకు వార్డులోని ప్రతి పేదవాడికి ప్రభుత్వ అండ లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
COMMENTS