చిలకలూరిపేట:నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని వార...
చిలకలూరిపేట:నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని చిలకలూరిపేట మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ని వారి నివాసంలో జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వం....
అనంతరం చరణ్ తేజ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా రంజక పాలన సాగుతోందని కొనియాడారు. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బిజెపి సమన్వయంతో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పట్టాలెక్కిందని ఆశాభావం వ్యక్తం చేశారు. "ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నిరుద్యోగులకు భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకం. రాబోయే రోజుల్లో రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందనడంలో సందేహం లేదు." అని చరణ్ తేజ పేర్కొన్నారు.
నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడు పుల్లారావు..
నియోజకవర్గ అభివృద్ధిలో ప్రత్తిపాటి
పుల్లారావు పాత్ర అమోఘమని చరణ్ తేజ ఆయనకున్న రాజకీయ అనుభవం, అభివృద్ధి పట్ల ఉన్న విజన్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తుందని నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడిగా పుల్లారావు ఆదర్శప్రాయులని కూటమి నేతలందరినీ కలుపుకుని పోతూ, చిలకలూరిపేటను అన్ని రంగాల్లో ముందుంచడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రత్తిపాటి పుల్లారావు కి శుభాకాంక్షలు తెలిపారు.
COMMENTS