2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లను మర...
2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె అందిస్తున్న సేవలను కొనియాడారు.అనంతరం ఆయన జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి, నరసరావుపేట ఆర్డీఓ మధులత, మరియు జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్వరమ్మలను విడివిడిగా కలిశారు. వారికి పండ్లను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అధికారులందరూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, సామాజిక సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడంలో కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. వీరితోపాటు బిజెపి నాయకులు బందెల శ్రీనివాసరావు పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
COMMENTS