చిలకలూరిపేట: పట్టణంలోని సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానుల గ్రూప్ (కృష్ణ మహేష్ యువత పీపుల్ సొసైటీ) ఆధ్వర్యంలో రూపొందిం...
చిలకలూరిపేట: పట్టణంలోని సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానుల గ్రూప్ (కృష్ణ మహేష్ యువత పీపుల్ సొసైటీ) ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కె.వి.ఎస్. సురేష్ కుమార్ తన చేతుల మీదుగా క్యాలెండర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా చిలకలూరిపేట కృష్ణ మహేష్ యువత పీపుల్ సొసైటీ గౌరవ అధ్యక్షులు గర్రె బాబురావు మాట్లాడుతూఏటా అభిమానులందరినీ ఏకం చేస్తూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని, అందులో భాగంగానే ఈ ఏడాది క్యాలెండర్‌ను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ సురేష్ కుమార్ అభిమానుల ఉత్సాహాన్ని అభినందిస్తూ, సూపర్ స్టార్ కుటుంబం పట్ల చూపిస్తున్న ఈ అభిమానం ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లాయర్ వహాబ్, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
COMMENTS