పథకాల నిధుల్లో 91 శాతం వినియోగం.. సీఎం-కలెక్టర్ల కాన్ఫరెన్స్. రాష్ట్ర అనుసంధాన పథకాల అమలులో పల్నాడు జిల్లా రాష్ట్రంలో నెంబర్ ...
పథకాల నిధుల్లో 91 శాతం వినియోగం..
సీఎం-కలెక్టర్ల కాన్ఫరెన్స్.
రాష్ట్ర అనుసంధాన పథకాల అమలులో పల్నాడు జిల్లా రాష్ట్రంలో నెంబర్ వన్ గా నిలిచింది. 47 పథకాలకు సంబంధించి 91 శాతం నిధులు ఖర్చు చేసి 26 జిల్లాల్లో అగ్రస్థానం పొందింది.47 రాష్ట్ర అనుసంధాన పథకాలకు సంబంధించి మొత్తం రూ.167 కోట్లకు గానూ జిల్లాలో రూ.151 కోట్లు లబ్ధిదారులకు నేరుగా చెల్లించడం లేదా వెచ్చించడం జరిగింది.
డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ (90%), నంద్యాల (89%) జిల్లాలు వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి-కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ అంశాలపై చేపట్టిన సమీక్షలో భాగంగా వివరాలు వెల్లడించడం జరిగింది.జిల్లాను నెంబర్ వన్ గా నిలపడంలో కృషి చేసిన అధికారులకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అభినందనలు తెలిపారు.
COMMENTS