ప్రాణ భయంతో కాలనీవాసులు... చిలకలూరిపేట పట్టణంలోని రూత్ డైట్ మెన్ కాలనీలో డ్రైనేజీ కాలువలు లేకపోవడం వల్ల వర్షాకాలంలో ...
ప్రాణ భయంతో కాలనీవాసులు...
చిలకలూరిపేట పట్టణంలోని రూత్ డైట్ మెన్ కాలనీలో డ్రైనేజీ కాలువలు లేకపోవడం వల్ల వర్షాకాలంలో ఇళ్ల మధ్య నీరు నిలిచి, చిన్నపాటి కుంటలుగా మారుతున్నాయి. ఈ నీటి కుంటల్లో కలుపు మొక్కలు, గడ్డి విపరీతంగా పెరిగి, పాములకు నివాసాలుగా మారాయి. దీంతో కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు.
నీటి కుంటల కారణంగా దోమల బెడద పెరిగి, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇళ్లలోకి పాములు రావడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
చిన్న పిల్లలు ఆడుకోవడానికి బయటకువెళ్లాలన్నా,పెద్దవారు రోడ్డుపై నడవాలన్నా భయపడిపోతున్నారు.ఈ సమస్యపై తక్షణమే అధికారులు స్పందించి,డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, నీటి కుంటలను తొలగించాలని, కలుపు మొక్కలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల భద్రత కోసం, ఆరోగ్య పరిరక్షణ కోసం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
COMMENTS