మురుగునీరు నిలబడకుండా కాల్వల్లో పూడికలు తీత ప్రజారోగ్య పరిరక్షణకు దోమల మందు పిచికారి అధికారుల స్పందనపై ప్రజల హర్షం చిలక...
- మురుగునీరు నిలబడకుండా కాల్వల్లో పూడికలు తీత
- ప్రజారోగ్య పరిరక్షణకు దోమల మందు పిచికారి
- అధికారుల స్పందనపై ప్రజల హర్షం
చిలకలూరిపేట:
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాదు.. సమస్యను ముందుగానే గుర్తించి ఆ సమస్యను పరిష్కరించటం విజ్ఞులైన అధికారుల పని. ఇప్పుడు ఈ దిశగానే మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు నేతృత్వంలో అధికారులు స్పందిస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలో గతంలో చిరుజల్లులకే పట్టణం జలమయమయ్యేదు. కాల్వల్లో మురుగు నీరు పారక రోజుల తరబడి లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలబడి అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలి అసలే అంతంత మాత్రంగా ఉండే ప్రజారోగ్యం మరింతగా క్షీణించేది.మా సమస్యలు పరిష్కరించటం బాబు అని ప్రజలు అధికారుల చుట్టూ తిరిగినా చెద్దాం.. చూద్దాం అంటూ దాటవేయడం పరిపాటిగా మారేది. ఇదంతా గతం.
*ఎమ్మెల్యే ప్రత్తిపాటి ప్రత్యేక చొరవతో*
ఇందుకు భిన్నంగా ప్రస్తుతం రాబోయే సమస్యను ముందుగానే గుర్తించి శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవతో పెద్ద కాల్వపై ఉన్న అక్రమణలను తొలగించి, కాల్వల్లో సంవత్సరాలుగా పేరుకు పోయిన సిల్ట్‌ను తొలగించారు. వర్షాకాలానికి ముందే తరచు ముంపుకు గురి అవుతున్న ప్రాంతాలను గుర్తించి, సమస్యల పరిష్కరానికి మార్గాలు అన్వేషించారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రధాన కాల్వలు శిధిల అవస్థకు చేరుకోవడం, పూడికలు ఏర్పడటంలో మురుగునీరు పారక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు నీట మునిగేవి. ఉదాహరణకు ప్రముఖ స్వచ్చంధ ఏఎంజీలో సైతం వర్షపు నీరు వచ్చి చేరటం సమస్య తీవ్రతకు అద్దం పెట్టింది. ఇటువంటి తరుణంలో ఈ కాల్వల్లో పూడికలు తీయించటం, శిధిలాలు తొలగించి , మురుగునీరు పారేలా చేయడంతో కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యింది. పురుషోత్తమపట్నంలో ఇదే సమస్య తీవ్రంగా ఉండేది. అనేక కాల్వల్లో పూడికలు తీసే పరిస్తితి లేకుండా ఉండేది. రోడ్డు నుంచి ఓగేరువాగుకు వెళ్లే ప్రధాన కాల్వల్లో పూడికలు తీసి కొన్ని సంవత్సరాలు అవుతున్న తరుణంలో జేసీబీ ద్వారా అడ్డుగా ఉన్న పెద్ద బండరాళ్లు తొలగించి పూడికలు తీయించారు. ఆక్రమణలు తొలగించారు. దీంతో ముంపు సమస్య తప్పింది.
*ప్రజారోగ్య పరిరక్షణకు కృషి*
వర్షాలు కురిసినప్పుడు, వాతావరణ మార్పు కారణంగా వ్యాధులు విజృబించటం, దోమలు వ్యాప్తి చెందటం పరిపాటి. మురుగునీరు నిల్వ ఉండకుండా చూడటంతో పాటు, ఆ ప్రాంతాల్లో దోముల వ్యాప్తి చెందకుండా దోమల మందు పిచికారి చేస్తున్నారు. చేసే పని తూతూ మంత్రంలా కాకుండా పూర్తిస్థాయిలో కొనసాగేలా పారిశుధ్య అధికారులు, మేస్తులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిక్షణకు కృషి చేస్తున్న అధికారుల తీరు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


COMMENTS