చిలకలూరిపేట: పట్టణంలోని కుమ్మరి కాలనీలో గత 30 సంవత్సరాలుగా బైపాస్ రోడ్డు పక్కన సుమారు 25 సెంట్ల ఖాళీ స్థలంలో చెట్లు, పిచ్చట్లు ప...
చిలకలూరిపేట: పట్టణంలోని కుమ్మరి కాలనీలో గత 30 సంవత్సరాలుగా బైపాస్ రోడ్డు పక్కన సుమారు 25 సెంట్ల ఖాళీ స్థలంలో చెట్లు, పిచ్చట్లు పెరిగి ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పొదల్లో పురుగు పుట్రా, పాములు తిరుగుతూ భయాందోళనకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో స్థానికులు కంచర్ల శ్రీనివాస్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి ఈ విషయాన్నితీసుకెళ్లారువెంటనే స్పందించిన శాసనసభ్యులు పుల్లారావు ఆ స్థల యజమానిని పిలిపించి ఆ ప్రాంతంలోని చెట్లు, పిచ్చట్లు తొలగించేలా చర్యలు తీసుకున్నారు.ఈ చర్యకు స్థానిక మహిళలు షేక్ లీలామస్తాన్ బీ ఆధ్వర్యంలో పలువురు మహిళలతో శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల సమస్యపై త్వరితగతిన చర్య తీసుకుని సమస్యను పరిష్కరించినందుకు స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.
COMMENTS