ఎడ్లపాడులో రోడ్డు భద్రత అవగాహన. ఎడ్లపాడు: పల్నాడు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై రోడ్డు భద్రతను బలో...
ఎడ్లపాడులో రోడ్డు భద్రత అవగాహన.
ఎడ్లపాడు: పల్నాడు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై రోడ్డు భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా “హెల్మెట్ లేకుండా జాతీయరహదారిలో ప్రవేశం లేదు” అనే నిబంధన అమలు అవుతున్నందున ప్రజలకు అవగాహన కార్యక్రమం ఎడ్లపాడు ఎస్సై టి శివరామకృష్ణ నిర్వహించారు.ఈ సందర్భంగా బుధవారం ఎడ్లపాడు హైవే ప్రవేశ ద్వారం వద్ద ఎడ్లపాడు ఎస్సై టి.శివరామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బందితో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాద సమయంలో ప్రాణ రక్షణలో హెల్మెట్ ప్రాధాన్యత గురించి వివరించారు. హెల్మెట్ లేకుండా జాతీయ రహదారిపై ప్రయాణించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై టి శివరామకృష్ణ హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణ భద్రతను కాపాడుకోవాలని కోరారు.రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
COMMENTS