పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. అనిల్‌కుమార్ తన సిబ్బందితో కలిసి బుధవారం చిలకలురి...
పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి. అనిల్‌కుమార్ తన సిబ్బందితో కలిసి బుధవారం చిలకలురిపేట రూరల్ రామచంద్రాపురం గ్రామ పరిధిలోని ఫ్లైఓవర్ క్రింద ట్రాఫిక్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా మోటార్‌సైకిళ్లు నడిపిన 20 మందికి చలానాలు విధించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి అవగాహన కల్పిస్తూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ఉపయోగించాలని ఎస్ఐ అనిల్‌కుమార్ సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే మోటార్ వాహన చట్టం ప్రకారం జరిమానా విధించబడుతుందని ఆయన అన్నారు.
COMMENTS