నాదెండ్ల: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సర్వేలనుసమగ్రంగా, ఖచ్చితంగా నిర్వహించాలని డిప్యూటీ ఎంపీడీవో వెంకట్రావు గ్రామ సచివాల...
నాదెండ్ల: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సర్వేలనుసమగ్రంగా, ఖచ్చితంగా నిర్వహించాలని డిప్యూటీ ఎంపీడీవో వెంకట్రావు గ్రామ సచివాలయాల సిబ్బందినిఆదేశించారు. నాదెండ్ల మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన ఆధ్వర్యంలో సర్వేలపై అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగావెంకట్రావు మాట్లాడుతూ సర్వేల్లో సిబ్బంది అనుసరించాల్సిన విధానాలను, సాంకేతిక అంశాలను వివరించారు. పౌరుల నుండి సేకరించాల్సిన సమాచారాన్ని కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. సర్వేల్లో నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని, ప్రతి అంశాన్ని సమగ్రమైన దృష్టితో నిర్వహించాలని ఆయనసూచించారు.
కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మండల ఏఈ రవీంద్ర, సాతులూరు పంచాయతీ కార్యదర్శి రాఘవయ్య, గణపవరంపంచాయతీ కార్యదర్శి మారుతీ బాబు, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, విఆర్వోలు పాల్గొన్నారు. సర్వేయర్లు,డిజిటల్ సహాయకులు మినహా అన్ని విభాగాల సిబ్బంది ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
COMMENTS