పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని కలెక్టరేట్ పరిసర ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మరియు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్...
పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని కలెక్టరేట్ పరిసర ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మరియు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భవనాల నిర్మాణానికి ఒక ఎకరం స్థలం కేటాయించాలని ఎంఆర్‌పిఎస్ (MRPS) రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కోరారు.ఈ మేరకు ఆయన కలెక్టర్‌కువినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో దళిత, బహుజన బిడ్డల ఆత్మగౌరవ ప్రతీకలుగా,సామాజిక చైతన్యకేంద్రాలుగా ఈ భవనాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. నర్సరావుపేట పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలోనే ఈ భవనాలనిర్మాణానికి ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం చొరవ చూపి, తక్షణమే స్థల కేటాయింపు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.జిల్లా నలుమూలల నుండి వచ్చే పేద విద్యార్థులకు, సామాజిక కార్యకర్తలకు ఈ భవనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, త్వరితగతిన నిధులు మంజూరు చేసి భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని అడపా మోహన్ మాదిగ కోరారు.
COMMENTS