ఎడ్లపాడు: మండలంలోని బోయపాలెం గ్రామంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిడిపి మం...
ఎడ్లపాడు: మండలంలోని బోయపాలెం గ్రామంలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబు ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా గ్రామం పార్టీ అధ్యక్షులు షేక్ రాజ మహమ్మద్, మండల పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ బుడే, షేక్ నాగూర్ వలి, షేక్ అల్లా బక్షు, షేక్ మహమ్మద్ పాల్గొన్నారు. అంగనవాడి టీచర్లు, ఆశా వర్కర్లు కూడా కార్యక్రమంలో భాగమయ్యారు.శిశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా పోలియో నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
COMMENTS