చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముక వైద్యశాల లీలావతి హాస్పిటల్స్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆసుపత్రి మ...
చిలకలూరిపేట: పట్టణంలోని ప్రముక వైద్యశాల లీలావతి హాస్పిటల్స్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లావు సుష్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుష్మ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా వైద్య సేవల్లో రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించడమే నిజమైన సేవ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS