మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు. చిలకలూరిపేట: పట్టణంలోని 37వ వార్డు పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యల పర...
మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు కృతజ్ఞతలు.
చిలకలూరిపేట: పట్టణంలోని 37వ వార్డు పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక కౌన్సిలర్ పాములపాటి శివ కుమారి వార్డులోని దెబ్బతిన్న రోడ్లు, అస్తవ్యస్తంగా మారిన సైడ్ డ్రైనేజీ కాలువల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కౌన్సిలర్ శివకుమార్ గమనించారు.ఈ సమస్యలను ఆయన వెంటనే మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లారు. వార్డు ప్రజల కష్టాలను వివరించిన వెంటనే ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి, ప్రస్తుతం వార్డులో రోడ్ల మరమ్మత్తులు మరియు డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టారు.
సమస్యను వివరించిన వెంటనే స్పందించి, నిధులు కేటాయించి పనులు ప్రారంభమయ్యేలా చూసినందుకు గాను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు కౌన్సిలర్ పాములపాటి శివ కుమారి మరియు వార్డు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా వార్డులో పారిశుద్ధ్య సమస్యలు తొలిగి, రాకపోకలు సులభతరం అవుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
COMMENTS