నాదెండ్ల: మండల పరిషత్ కార్యాలయంలో గురువారం వచ్చే ఆదివారం (డిసెంబర్ 21, 2025) నాడు మండలంలో జరగనున్న పోలియో ఆదివారం కార్యక్రమం విజ...
నాదెండ్ల: మండల పరిషత్ కార్యాలయంలో గురువారం వచ్చే ఆదివారం (డిసెంబర్ 21, 2025) నాడు మండలంలో జరగనున్న పోలియో ఆదివారం కార్యక్రమం విజయవంతం కావడానికి పలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశంజరిగింది.ఈ సందర్భంగా అధికారులు కార్యక్రమ ప్రచారం, పోలియో చుక్కల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు, పిల్లలందరికీ చుక్కలు వేయించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపైచర్చించారు.
కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయం అవసరమని వారు పేర్కొన్నారు.సమావేశం అనంతరం పోలియోపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వై.వి.బి. కుటుంబరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, నాదెండ్ల పీహెచ్‌సీ వైద్యాధికారిణి జ్ఞానేశ్వరి,అంగన్వాడీ పర్యవేక్షకురాలు నిర్మల కృష్ణ మాల, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
COMMENTS