ఎడ్లపాడు: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వంత ఆదాయ వనరులు పెంపుదల మర...
ఎడ్లపాడు: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వంత ఆదాయ వనరులు పెంపుదల మరియు స్వమిత్వ గ్రామ సర్వే పై సిబ్బందికి అవగాహన కల్పించారు.శిక్షణా తరగతులకు ఫ్యాకల్టీగా కే చారి విఆర్వో స్వమిత్వ కార్యక్రమానికి సంబంధించిన అంశాలను వివరించగా, బాపిరాజు పంచాయతీ కార్యదర్శి స్వంత ఆదాయ వనరులు పెంపు మార్గాలను సిబ్బందికి వివరిస్తూ సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి హేమలత దేవి మరియు డిప్యూటీ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి జాకీర్ హుస్సేన్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల వీఆర్వోలు పంచాయతీ సెక్రెటరీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
COMMENTS