ఆంధ్రప్రదేశ్: పదవ తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపునకు శుక్ర, శనివారం (నేడు, రేపు) వరకు అవకాశం కల్పించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం ...
ఆంధ్రప్రదేశ్: పదవ తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపునకు శుక్ర, శనివారం (నేడు, రేపు) వరకు అవకాశం కల్పించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడి లాగిన్ ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు. తక్కువ వయసున్న విద్యార్థులు వయసు మినహాయింపు ఫీజును బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో చెల్లించవచ్చన్నారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు కూడా అదే వెబ్ సైట్ నుంచి ఫీజులు కట్టొచ్చని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు చివరి రోజు వరకు వేచిచూడ కుండా వీలైనంత త్వరగా ఫీజులు చెల్లించాలన్నారు.
COMMENTS