చిలకలూరిపేట: రూరల్ పరిధిలోని గోపాలంవారిపాలెం గ్రామ పరిధిలో పేకాటా క్రీడ కొనసాగుతుందన్న సమాచారం మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స...
చిలకలూరిపేట: రూరల్ పరిధిలోని గోపాలంవారిపాలెం గ్రామ పరిధిలో పేకాటా క్రీడ కొనసాగుతుందన్న సమాచారం మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జి. అనిల్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు దాడి చేశారు. ఈ చర్యలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.18,200 నగదు, ఒక ఆటో, నాలుగు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
COMMENTS