చిలకలూరిపేట పట్టణం మరియు మండలంలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వాహనదారులు ఎవరూ ప్యానిక్ కావాల్సిన అవసరం ల...
చిలకలూరిపేట పట్టణం మరియు మండలంలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వాహనదారులు ఎవరూ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని తహశీల్దార్ మహమ్మద్ హుస్సేన్ స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని భారత్ పెట్రోలియం బంకును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా ఉన్న 15 ఆయిల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
వాహనదారులు ఇంధనం అయిపోతుందనే భయంతో అనవసరంగా స్టాక్ చేసుకోవద్దని, కేవలం అవసరమైన మేరకే ఆయిల్ కొట్టించుకోవాలని సూచించారు.రైతులకు వెసులుబాటు వ్యవసాయ అవసరాల కోసం ఆయిల్ కావాల్సిన రైతులు నేరుగా సచివాలయానికి వెళ్లి, విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ (VAO) వద్ద కూపన్ తీసుకుని బంకుల్లో ఇంధనం పొందవచ్చని వివరించారు.
బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా...
పెట్రోల్, డీజిల్ అక్రమంగా నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై నిరంతర పర్యవేక్షణ కోసం పోలీసు మరియు రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేకంగా డ్యూటీలు వేసినట్లు తహశీల్దార్ వెల్లడించారు.ప్రజలు అధికారులకు సహకరించాలని, నిరాధారమైన వార్తలను నమ్మి ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు.
COMMENTS