పేద మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా బావా ఎప్పుడు వచ్చితీవు నాటకం. ముత్తవరపు సురేష్ కేవలం ఒక విజయవంతమైనపారిశ్రామికవేత్తగానే కాకుండా,క...
పేద మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా బావా ఎప్పుడు వచ్చితీవు నాటకం.
ముత్తవరపు సురేష్ కేవలం ఒక విజయవంతమైనపారిశ్రామికవేత్తగానే కాకుండా,కళల పట్ల అపారమైన మక్కువ కలిగిన ఒక గొప్ప కళాభిమానిగా, కళాపోషకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పారిశ్రామిక రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నప్పటికీ, భారతీయ సంస్కృతికి వెన్నెముక వంటి నాటక రంగాన్ని బ్రతికించుకోవాలనే తపన ఆయనలో మెండుగా ఉంది.
సొంత నిధులతో కళా క్షేత్ర నిర్మాణం..
ముత్తవరపు సురేష్ కళా హృదయానికి నిదర్శనం ఎడ్లపాడులో ఎంవి చౌదరి సహాయ సహకారాలతో ముత్తవరపు సురేష్ ఆధ్వర్యంలో వారు నిర్మించిన ఎంవి చౌదరి కళాక్షేత్రం సుమారు ఒక ఎకరం స్థలంలో,ఈ కళాక్షేత్రాన్ని నిర్మించి, గత 30 సంవత్సరాలుగా నిర్విరామంగా నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహించే ఈ సాంస్కృతిక వేడుకలు స్థానిక ప్రజలకు వినోదాన్ని పంచడమే కాకుండా, కళాకారులకు ఒక గొప్ప వేదికను కల్పిస్తున్నాయి.
నాటక రంగ పరిరక్షణ - అద్భుత ప్రదర్శన..
నేటి డిజిటల్ యుగంలో నాటక రంగం ప్రాభవం కోల్పోతున్న తరుణంలో, ఆయన లాభాపేక్ష లేకుండా తన సంపాదనను కళల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన అంతర్జాతీయ నాటకోత్సవాలలో సైతం సురేష్ తన విశిష్ట పాత్రను చాటుకున్నారు.విదేశీ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేశారు.
నటనలో మేటి - పారిశ్రామికవేత్తలోని కళాకారుడు..
సురేష్ కేవలం వేదిక వెనుక ఉండే నిర్వాహకుడిగానే కాకుండా, రంగు వేసుకుని రంగస్థలంపై నటించే అద్భుతమైన కళాకారుడు కూడా. వ్యాపార పనుల మధ్య ఎంత బిజీగా ఉన్నా, రిహార్సల్స్ కోసం సమయం కేటాయించి నాటకంలో ఆయన పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. వేదికపై ఆయన పలికించిన హావభావాలు, నటన పట్ల ఆయనకున్న అంకితభావాన్ని చాటిచెప్పాయి.ఒక పారిశ్రామికవేత్త తన సామాజిక బాధ్యతగా కళలను కాపాడుకోవాలని తలపెట్టడం నిజంగా అభినందనీయం. 30 ఏళ్లుగా నిరంతరాయంగా కళాసేవ చేస్తూ, సొంత నిధులతో కళాకారులకు అండగా నిలుస్తున్న ముత్తవరపు సురేష్ గారు నాటక రంగానికి ఒక పెద్ద దిక్కుగా నిలిచారు. ఆయన ప్రయాణం భావి తరాలకు మరియు తోటి పారిశ్రామికవేత్తలకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకం.
పారిశ్రామిక వ్యక్తి పేర్ని వీరనారాయణ సురేష్ కు అభినందనలు.
ముత్తవరపు సురేష్ కృషిని ప్రముఖులు పేర్ని వీరనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. పేద మధ్య తరగతి జీవితాలకు బావా ఎప్పుడు వచ్చితీవు నాటిక చాలా దగ్గరగా ఉందని, అది ఆయన చూడటం జరిగిందని,గ్రామీణ స్థాయి నుంచి కళలను ప్రోత్సహిస్తూ, తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్న సురేష్ లాంటి వ్యక్తులు నేటి సమాజానికి ఎంతో అవసరమని ఆయన కొనియాడారు.ఎడ్లపాడు గ్రామ కీర్తిని అంతర్జాతీయ స్థాయి నాటకోత్సవాల వరకు తీసుకెళ్లడం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా ముత్తవరపు సురేష్ వారి బాల్య స్నేహితులు కంచర్ల శ్రీనివాసరావు కూడా అభినందనలు తెలియజేశారు.
COMMENTS