నాదెండ్ల :మండలం చిరుమామిళ్ల గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో ప...
నాదెండ్ల :మండలం చిరుమామిళ్ల గ్రామంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గ్రామంలో చేపట్టిన ఈ 'కార్డెన్ సెర్చ్' తనిఖీలు స్థానికంగా కలకలం రేపింది. ట్రైనీ డీఎస్పీ జై నిరంజన్ నేతృత్వంలో పోలీసులు ప్రతి ఇంటిని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 24 మోటార్ సైకిళ్లను,ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. వీటితో పాటు అక్రమంగా నిల్వ ఉంచిన మూడు కత్తులను మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అసాంఘికకార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు.
COMMENTS