600కు 590 మార్కులతో టాప్ స్కోరర్‌గా షేక్ మహమ్మద్ కాజా మొయినుద్దీన్.. చిలకలూరిపేట: ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో చిలకలూరిపే...
600కు 590 మార్కులతో టాప్ స్కోరర్‌గా షేక్ మహమ్మద్ కాజా మొయినుద్దీన్..
చిలకలూరిపేట: ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో చిలకలూరిపేట పట్టణంలోని ప్రగతి హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి,పాఠశాల కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులు సాధించిన అసామాన్య విజయాలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది.
పాఠశాల విద్యార్థుల్లో షేక్ మహమ్మద్ కాజా మొయినుద్దీన్ 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా,మహమ్మద్ సమీరా 584 మార్కులు, గణపవరపు మధుసూదన్ 583 మార్కులతో తమ సత్తా చాటారు.
ఫలితాల ముఖ్యాంశాలు..గరిష్ట మార్కులు..
590/600 (షేక్ మహమ్మద్ కాజా మొయినుద్దీన్) 8 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు.పరీక్షలకు హాజరైన మొత్తం 22 మంది విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులై 100% ఫలితాలను నమోదు చేశారు.
*విద్యార్థులకు సత్కారం..
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మేడం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా అభినందించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు అందజేసి సత్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.."సామాన్య విద్యార్థులతో అసామాన్య ఫలితాలను సాధించడమే మా పాఠశాల ప్రత్యేకత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణ,క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యే ఈ విజయానికి పునాది."
ప్రవేశాలు ప్రారంభం (2026–27)..
విజయాలకు చిరునామాగా నిలిచిన ప్రగతి హై స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.
సీబీఎస్ఈ (CBSE) సిలబస్‌తో పాటు ప్రాథమిక స్థాయి నుండే IIT-JEE కి అత్యుత్తమ శిక్షణ.విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే మా ధ్యేయం.
ఉత్తమ విద్యా ప్రమాణాలతో మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకునే తల్లిదండ్రులు ప్రవేశాల కోసం త్వరపడండి.
ప్రగతి హై స్కూల్ – విద్యకు నిలయము... విజయాలకు కేరాఫ్ అడ్రస్..
COMMENTS