ఎడ్లపడు: మండల పరిధిలోని జగ్గాపురం గ్రామంలో స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతులు ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు 40 రోజులు ...
ఎడ్లపడు: మండల పరిధిలోని జగ్గాపురం గ్రామంలో స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతులు ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు 40 రోజులు పాటు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ శాఖ అధికారి ఐ.శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సమ్మర్ క్లాసుల్లో ముఖ్యంగా విద్యార్థులలో తెలుగు భాషాభివృద్ధి పెంపొందించేందుకు కథలు చదవడం, రాయడం,పుస్తకాలు చదవడం,విలువలు విద్య, స్పోకెన్ ఇంగ్లిష్,డ్రాయింగ్, పెయింటింగ్ పేపర్ క్రాఫ్ట్,డ్యాన్స్, చెస్,జికె, యోగ మొదలైన అంశాలను నేర్పిస్తారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి బోధించడానికి వాలంటీర్ గా ప్రతిభ కలిగిన వారు తమ పేర్లను నమోదుచేసుకోవాలని, వివరాలకు 9032060208 నంబరుకి సంప్రదించాలని ఆయన కోరారు.
COMMENTS