చిలకలూరిపేట: 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వేదికగా చెత్త సేకరణ రిక్షాల...
చిలకలూరిపేట: 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వేదికగా చెత్త సేకరణ రిక్షాలను మరియు డస్ట్ బిన్లను పంపిణీ చేశారు. పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఏడు పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోమటినేని వారి పాలెం, కావూరు, గంగన పాలెం, గోవిందపురం, మురికిపూడి, కమ్మవారిపాలెం, ఎడవల్లి పంచాయతీలకు కొత్త రిక్షాలను అందజేశారు. గ్రామాల్లో చెత్త సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి మరియు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి ఈ పరికరాలు ఎంతగానో దోహదపడతాయని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
COMMENTS