చిలకలూరిపేట: పట్టణంలోని స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాలకీ పూలదండలు వేసి పూలతో ఘనంగా నివాళులర...
చిలకలూరిపేట: పట్టణంలోని స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాలకీ పూలదండలు వేసి పూలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్య అతిథులుగా జ్యోతి చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పాల భాస్కర్ రావు, ఉపాధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి మారు బోయిన శ్రీనివాసరావు, బీసీ నాయకులు రిటైర్డ్ ఎక్సైజ్ సీఐ గోరంట్ల నారాయణరావు యాదవ్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా స్త్రీ విద్య కుపునాది వేసి విద్యా దీపం వెలిగించిన విప్లవ మహిళ, విద్య అనే ఆయుధంతో స్త్రీలలో చైతన్యం పెంపొందించి అజ్ఞానాన్ని కులవాదాన్ని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. వితంతు పునర్వివాహాలను చేయించిన గొప్ప మానవతావాది అని అన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించి వారికి చదువు చెప్పే క్రమంలో పేడ నీళ్లు రాళ్లు విసిరిన వాటిని తప్పించుకొని వెళ్లి విద్యా అందించిన గొప్ప సంఘసంస్కర్త, అనాధ పిల్లల కోసం ఆశ్రమాలు స్థాపించి ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు వారిని ధైర్యంగా ఆమె హాస్పిటల్స్ చేర్చి వైద్యం అందించి చివరికి ఆ ప్లేగు వ్యాధితో మరణించడం జరిగింది,ఫూలే చైతన్య జ్యోతి సేవా సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు నిడమానూరు వెంకట్ , టౌన్ అధ్యక్షులు మందాడి ఫణికుమార్ ,కమిటీ మెంబర్స్ దాసరి శ్రీనివాసరావు దాసరి వెంకటేశ్వర్లు పట్టణ టిడిపి బీసీ సెల్ అధ్యక్షురాలు శ్రీమతి,టి.కాసులు,కొండవీటి గోపి,బీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి పోటు శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
COMMENTS