చిలకలూరిపేట:సెల్ ఫోన్ వినియోగదారులు రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ సూచిం...
చిలకలూరిపేట:సెల్ ఫోన్ వినియోగదారులు రద్దీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ సూచించారు.రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 10 మంది బాధితులకు రికవరీ చేసిన ఫోన్లను ఆయన స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ మాట్లాడుతూ ముఖ్యంగా బస్టాండ్లు, మార్కెట్లు మరియు జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఒకవేళ పొరపాటున ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఆందోళన చెందకుండా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోయిన ఫోన్లను త్వరితగతిన రికవరీ చేసి బాధితులకు అందజేశారు.
COMMENTS