చిలకలూరిపేట: పట్టణంలోని హ్యాపీ హోమ్స్ సమీపంలో గల పొలాల్లో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింద...
చిలకలూరిపేట: పట్టణంలోని హ్యాపీ హోమ్స్ సమీపంలో గల పొలాల్లో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పొలాల్లో మృతదేహాన్ని గమనించిన స్థానిక రైతులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే చిలకలూరిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహం ఎవరిది? ఎక్కడి నుండి వచ్చారు? అనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ప్రాథమిక పరిశీలన అనంతరం, ఇది హత్యనా లేక ఆత్మహత్యనా? అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
COMMENTS