ఎడ్లపాడు: పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు ఈరోజు ఎడ్లపాడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు చేసిన శనగల ...
ఎడ్లపాడు: పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు ఈరోజు ఎడ్లపాడు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.ఏపీ మార్క్‌ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పై శనగలు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.మండలంలోని అందరు రైతులు ఈ సౌకర్యాన్ని అందుపొందుకొని, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా క్వింటాకు రూ.5,875 చొప్పున శనగలు అమ్ముకోవాలని సూచించారు.తదుపరి ఎడ్లపాడు పరిధిలో రబీ పంట కాలంలో నమోదు చేసిన పంట వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే, రాతపూర్వకంగా రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదించి గ్రీవెన్స్ అర్జుల ద్వారా సరిచేసుకోవచ్చని రైతులకు తెలియజేశారు.ఈ ముసాయిదా జాబితా మార్చి 9 నుంచి 14 వరకు సరిచేసుకునే అవకాశం కల్పించబడింది. తుది జాబితా మార్చి 15న అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ.హరిప్రసాద్, సొసైటీ సీఈఓ శ్రీనివాసరావు,రైతు సేవా కేంద్ర సిబ్బంది అనుపమ,బిలాల్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.
COMMENTS