చిలకలూరిపేటలో జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం.. చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మార్చి 16న ...
చిలకలూరిపేటలో జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం..
చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్యశాల లీలావతి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మార్చి 16న 'జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం' ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో రోగనిరోధక శక్తి ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
2026 థీమ్: "అందరికీ రోగనిరోధకత మానవులకు సాధ్యమే"
ఈ ఏడాది వేడుకలను "అందరికీ రోగనిరోధకత మానవులకు సాధ్యమే" అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి అధినేత్రి డాక్టర్ లావు సుష్మా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ టీకాలు అందడం ద్వారానే మహమ్మారుల లేని సమాజాన్ని నిర్మించగలమని ఆమె స్పష్టం చేశారు.
చిన్నారులకు, గర్భిణీలకు సకాలంలో టీకాలు తప్పనిసరి..
డాక్టర్ సుష్మా మాట్లాడుతూపుట్టిన పసిబిడ్డ నుండి వృద్ధుల వరకు ప్రభుత్వం మరియు వైద్యులు సూచించిన విధంగా సకాలంలో టీకాలు తీసుకోవాలని సూచించారు. పోలియో, ధనుర్వాతం, హెపటైటిస్ వంటి ప్రాణాంతక వ్యాధులను కేవలం వ్యాక్సినేషన్ ద్వారానే సమూలంగా నిర్మూలించగలమని ఆమె వివరించారు.
లీలావతి హాస్పిటల్స్ సామాజిక బాధ్యత.
పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని లీలావతి హాస్పిటల్స్ నిరంతరం వ్యాక్సినేషన్ పంపిణీలో ముందుంటుందని, ప్రజలు మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయమైన వైద్య పద్ధతులను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది మరియు పలువురు రోగులు పాల్గొన్నారు.
COMMENTS