శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం... చిలకలూరిపేట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల ప్రవర్తనపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టా...
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం...
చిలకలూరిపేట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల ప్రవర్తనపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఆదివారం, పోలీసు స్టేషన్‌లో పట్టణ సీఐ పి. రమేష్ రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
నేరాలకు పాల్పడితే ‘పీడీ యాక్ట్’ తప్పదు..
ఈ సందర్భంగా సీఐ రమేష్ రౌడీ షీటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా గొడవలకు దిగినా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేర స్వభావాన్ని మార్చుకోని వారిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేయడమే కాకుండా, పట్టణ బహిష్కరణ చేసేందుకు కూడా వెనుకాడబోమని ఘాటుగా హెచ్చరించారు.
మంచి మార్గంలో బతకాలని సూచన...
గతాన్ని వదిలిపెట్టి, సమాజంలో గౌరవప్రదంగా బతకాలని సీఐ సూచించారు. ఏదైనా పనులు చేసుకుంటూ కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని, మళ్లీ నేరాల బాట పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. చట్టవ్యతిరేక పనులకు పాల్పడే వారి పట్ల పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
COMMENTS