పల్నాడు: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం మధ్యాహ్నం నరసరావుపేట పట్టణంలోని స్థానిక కలెక్టరేట్ వద్దనున్న ఏరియా ఆసుపత్రిని తన...
పల్నాడు: జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం మధ్యాహ్నం నరసరావుపేట పట్టణంలోని స్థానిక కలెక్టరేట్ వద్దనున్న ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు.
ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ బ్లాక్, ఐసీయు, రక్త నిధి కేంద్రం, ఆర్వో ప్లాంట్లను పరిశీలించారు.
ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులు, సహాయకులతో మాట్లాడారు. వ్యాధిగ్రస్తులకు, ఒక సహాయకుడికి భోజనం తప్పనిసరిగా అందించాలన్నారు. ఏరియా ఆసుపత్రి విస్తరణకు సంబంధించిన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణాల అనంతరం ఏరియా ఆసుపత్రిలో 200 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ ప్రసూన, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
COMMENTS