ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే కీలక నిర్ణయం తీసుకుంది అని చిలకలూరిపేట మున్సిపల్ రెవిన్యూ ఆఫీసర్ ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే కీలక నిర్ణయం తీసుకుంది అని చిలకలూరిపేట మున్సిపల్ రెవిన్యూ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణం మున్సిపల్ ఆఫీసులో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ జీఓ ఎంఎస్ నం. 58, తేదీ 16-03-2026 ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై ప్రత్యేక “వన్ టైం స్కీమ్”ను ప్రకటించింది అని,
ఈ పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులకు 50 శాతం వరకు వడ్డీ మాఫీ ఇవ్వనున్నారు. ముఖ్యంగా అసలు పన్ను (ప్రిన్సిపల్ ట్యాక్స్) మొత్తాన్ని 100 శాతం చెల్లించిన పక్షంలో, పేరుకుపోయిన వడ్డీపై సగం వరకు రాయితీ లభించనుంది.దీని వల్ల బకాయిల భారం తగ్గి,పన్ను చెల్లింపుదారులు సులభంగా బకాయిలను క్లియర్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం 31-03-2026 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. కాబట్టి సంబంధితులు ఈ గడువు లోపు అవకాశాన్ని చిలకలూరిపేట పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
COMMENTS